చంద్రబాబు అరెస్ట్ వెనుక సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CMKCR), ప్రధాని మోదీ, పాత్ర ఉందని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ (Madhu Yashki) ఆరోపించారు. చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వైసీపీ మూడు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని యాష్కీ ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం జగన్ (CM Jagan) ఇద్దరు కుమ్మక్కై చంద్రబాబునాయుడును అరెస్ట్ చేయించారని ఆరోపించారు. కేసీఆర్కు తెలియకుండా జగన్ ఏమీ చేయలేరని అన్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం సూట్ కేసులను పంపించారని మధు యాష్కీగౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్ (BRS), బీజేపీ, వైసీపీ మూడు పార్టీలు కలిసి చేసిన పని అని ఆయన అన్నారు. ఈ మూడు పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు.