స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శంకర్ సినిమాల్లోని పాటలు ఓ రేంజ్లో ఉంటాయి. కానీ లేటెస్ట్గా లీక్ అయిన సాంగ్ పై నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
రామ్ చరణ్(ram charan)తో శంకర్ సినిమా చేస్తున్నాడు అనగానే.. చరణ్ డ్యాన్స్, ఆ సాంగ్స్ విజువల్ గ్రాండియర్ గురించి అంతకు మించి అనేలా ఊహించుకుంటున్నారు. పైగా కేవలం గేమ్ చేంజర్ పాటల కోసమే దాదాపు రూ.90 కోట్ల వరకు ఖర్చు చేశారనే టాక్ బయటికి రావడం.. తమన్ ఈ సినిమా కోసం కొత్త బ్రెయిన్‌తో పని చేస్తున్నానని చెప్పడం.. అంచనాలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. కానీ ఇప్పటి వరకు గేమ్ చేంజర్ నుంచి జస్ట్ ఒక టైటిల్ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎదో ఒక లీక్ బయటకి రావడం కామన్ అయిపోయింది. ఫ్యాన్స్ ఎక్కడ షూటింగ్ జరుగుతున్నా రామ్ చరణ్ లుక్‌ని, సెట్ లుక్‌ని, ఆర్టిస్టులని ఇలా ఎదో ఒకటి లీక్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా ఇప్పుడు గేమ్ ఛేంజర్(Game Changer) సినిమా నుంచి ‘జరగండి జరగండి’ అనే సాంగ్ లీక్(Song leak)అయ్యి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే ఫోక్ స్టైల్ లో ఉన్న ఆ సాంగ్‌కు థమన్ ఇచ్చిన ట్యూన్ ఓకె అనిపించినా, ఆ లిరిక్స్ మాత్రం దారుణంగా ఉన్నాయనే కామెంట్స్(comments) వినిపిస్తున్నాయి. అబ్బా ఇది నిజంగానే గేమ్ చేంజర్ సాంగేనా? అనే సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా జరగండి జరగండి లిరిక్స్ ఏంట్రా బాబు.. అని సాంగ్ పైన నెగిటివ్ కామెంట్స్ చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇది బేసిక్ వర్షన్ అని తెలుస్తోంది. ఫైనల్ వర్షన్ అదిరిపోతుందని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంలో ఎవ్వరికీ క్లారిటీ లేదు.