»Shoaib Akhtar Brutally Slams Fans For India Fixed The Game Accusation
Asia Cup 2023: భారత్ అలా ఎందుకు చేస్తోంది.. ఫ్యాన్స్‌పై షోయబ్ అక్తర్ ఫైర్
శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ ఓడిపోయేందుకు ప్రయత్నించిందని పాకిస్థాన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మేరకు షోయబ్ అక్తర్‌కు మేసెజ్ కూడా చేశారు. ఫ్యాన్స్ చేస్తోన్న ఆరోపణలను అకర్త్ తోసిపుచ్చారు. భారత్ అలా ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు.
Shoaib Akhtar brutally slams fans for “India fixed the game” accusation
Asia Cup 2023: ఆసియా కప్ (Asia Cup 2023) సూపర్ 4లో శ్రీలంకతో టీమిండియా అనూహ్యంగా విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. తక్కువ స్కోర్ చేయడంతో.. మ్యాచ్ ఏమవుతుందా అనే సందేహాలు వచ్చాయి. కుల్దీప్ యాదవ్ (kuldeep Yadav) అపద్భాందువు పాత్ర పోషించాడు. అతనికి రవీంద్రా జడేజా (jadeja) తోడవడంతో శ్రీలంకపై భారత్ పై చేయి సాధించింది. నేరుగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు (Shoaib Akhtar) భారత్- శ్రీలంకకు సంబంధించిన మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మేసెజ్, మీమ్స్ వస్తున్నాయట. దీంతో ఆయన స్పందించారు.
శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ కావాలని ఎందుకు ఓడిపోతుందని ప్రశ్నించాడు. శ్రీలంక బౌలర్లు మెరుగ్గా రాణించారు. ఆ జట్టుకు చెందిన దునిత్ 42 పరుగులు చేయడమే గాక.. 5 వికెట్లు తీసి రాణించాడని గుర్తుచేశారు. ఫస్ట్ మ్యాచ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచాడని గుర్తుచేశారు. భారత జట్టు కూడా సమిష్టిగా ఆడింది. లంక జట్టు నడ్డిని యాదవ్, జడేజా విడిచారని పేర్కొన్నారు. రెండు జట్లు ఉత్తమ ప్రదర్శన ఇచ్చారని.. అందుకే ఆ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిందని తెలిపారు. ఆ మ్యాచ్ ఫిక్సింగ్ కాలేదని తేల్చిచెప్పారు.
కొందరు పాక్ అభిమానుల సందేహాం ఏంటంటే.. లంకతో మ్యాచ్‌లో భారత్ ఓడిపోతే.. పాక్ ఫైనల్‌కు రాదని విశ్లేషిస్తున్నారు. అందుకే భారత్ ఓడిపోయే ప్రయత్నం చేసిందని అంటున్నారు. వారి ఊహాగానాలను అక్తర్ కొట్టిపారేశారు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.