ఇటీవల నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 72 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరగడానికి కొద్ది సెకన్ల ముందు విమానంలో పరిస్థితి ఎలా ఉంది అనే విషయం ఇప్పటికే ప్రజలు వీడియో రూపంలో బయటకు వచ్చింది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి పెట్టిన ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆ వీడియో బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ కి చెందిన సోను జైస్వాల్ అనే వ్యక్తి ఫోన్ నుంచి ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో ఫుటేజీలో విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో తీశారు. పోఖరా విమానాశ్రయానికి చెందిన పరిసర ప్రాంతాలు ఈ వీడియోలో కనిపించాయి. తనవైపు తిప్పుకొని.. విమానంలోని ఇతర ప్రయాణికులను కూడా జైస్వాల్ చూపిస్తుండగానే ఈ ప్రమాదం జరిగింది. అప్పటికే విమానానికి మంటలు అంటుకోవడం, పొగలు రావడం కూడా వీడియోలో స్పష్టంగా కనపడింది.
ఎలా అనుమతిచ్చారు?
ఈ వీడియో చూసిన తర్వాత కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. అసలు జైస్వాల్ ఫ్లైట్‌లో ఉన్నప్పుడే ఫేస్బుక్లో ఎలా లైవ్ చేసాడు? అనే డౌట్ చాలామందికి వచ్చింది. విమానం… టేకాఫ్ అవుతున్న సమయంలో, ల్యాండ్ అవుతున్న సమయంలో మొబైల్ వాడొద్దని ఎయిర్ లైన్స్ సిబ్బంది అనౌన్స్ చేస్తూనే ఉంటారు. స్విచ్ఛాఫ్ చేయమని.. లేదంటే ఫ్లైట్ మోడ్ లో పెట్టమని సూచిస్తారు. కానీ జైస్వాల్ మాత్రం ఎందుకు ఆ సమయంలో ఫేస్ బుక్ లైవ్ పెట్టాడు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.. ఇది ప్రమాదానికి అంటున్నారు చాలామంది.
వాడితే ఏమవుతుంది?
విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో మీ ఫోన్స్ ను స్విచ్ ఆఫ్ చేయమని ఎయిర్ లైన్స్ సిబ్బంది చెప్తారు. అయితే ప్లైట్స్ లో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అధికారికంగా నిషేధించలేదు. కానీ ప్లైట్ అటెండెంట్స్ మాత్రం మీ మెుబైల్ ను స్విచ్ ఆఫ్ చేయమని చెప్తారు. సెల్ ఫోన్స్, వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే రేడియో తరంగాలు విమానంలోని నావిగేషన్ ని డిస్టర్బ్ చేస్తాయి. దీంతో ఏరోనాటికల్ కాక్ పిట్ వాయిస్ రికార్డర్ కి ఇబ్బంది కలుగుతుంది. అందుకే విమానాల్లో మొబైల్ వాడకాన్ని అనుమతించరు.
ఆ సదుపాయం ఉందా?
యుఎస్‌లోని అలియన్జ్ గ్లోబల్ అసిస్టెన్స్ 2017లో ఓ సర్వే చేసింది. అందులో దాదాపు 40% మంది విమానంలో సెల్ ఫోన్లను ఆన్‌లో ఉంచారని తేలింది. కొన్ని విమానయాన సంస్థలు ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీ సదుపాయాన్ని అందిస్తున్నాయి. నేపాల్, అరబ్ దేశాల్లో కూడా ఈ సదుపాయం అమలులో ఉంది. కొన్ని ఎయిర్ లైన్స్ విమానంలో మూవీస్, సంగీతం వినడానికి అనుమతిస్తాయి. కొన్ని మాత్రం ఇంటర్నెట్, వాయిస్ కాల్ కూడా అనుమతిస్తున్నాయి.