»Man Drives Jeep With Child On Bonnet During Onam Arrested
Man Drives Jeep With Child On Bonnet: జీపు బానెట్ పై చిన్నారిని ఎక్కించుకున్న వ్యక్తి.. కేసు పెట్టి జైల్లో వేసిన పోలీసులు
మంగళవారం ఓనం వేడుకల సందర్భంగా నిందితుడు తన స్నేహితుడి ఆరేళ్ల కుమారుడిని జీపు బానెట్‌పై కూర్చోబెట్టాడు. ఈ సమయంలో చిన్నారి తండ్రి కూడా జీపులోనే కూర్చున్నాడు. జీపుపై మరికొందరు కూడా ప్రయాణిస్తున్నారు.
Man Drives Jeep With Child On Bonnet: ఓ ప్రత్యేక వేడుకలో భాగంగా ఒక వ్యక్తి చిన్నారి పట్ల అజాగ్రత్తగా ప్రవర్తించాడు. అతను తన 6 ఏళ్ల కొడుకును తన జీపు బానెట్‌పై ఎక్కించుకున్నాడు. ఈ సందర్భంగా ఆ వ్యక్తి ఓ వీడియో కూడా చేయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటన కేరళలోని మేనంకుళం రోడ్డులో జరిగినట్లు సమాచారం. మంగళవారం ఓనం వేడుకల సందర్భంగా నిందితుడు తన స్నేహితుడి ఆరేళ్ల కుమారుడిని జీపు బానెట్‌పై కూర్చోబెట్టాడు. ఈ సమయంలో చిన్నారి తండ్రి కూడా జీపులోనే కూర్చున్నాడు. జీపుపై మరికొందరు కూడా ప్రయాణిస్తున్నారు.
కేరళ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తిరువనంతపురం (త్రివేండ్రం) సమీపంలో ఓనం సంబరాలు జరుపుకుంటున్న సమయంలో బోనెట్‌పై చిన్నారితో ఓపెన్ జీపు నడుపుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు చిన్నారి తండ్రికి స్నేహితుడు. మేనంకుళం రోడ్డులో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది.
నిందితుడు తన స్నేహితుడి ఆరేళ్ల కుమారుడిని బోనెట్‌పై కూర్చోబెట్టుకుని కారు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదకరమైన వేడుకను కొందరు బాటసారులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన సమయంలో బాలుడి తండ్రి, అతని మరికొందరు స్నేహితులు కూడా ఓపెన్ జీపులో ఉన్నారు. ఐపీసీ సెక్షన్ 279 (ర్యాష్ డ్రైవింగ్), మోటార్ వెహికల్స్ యాక్ట్ 184 (ప్రమాదకర డ్రైవింగ్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.