Heart attack: కార్డియాక్ అరెస్ట్ లక్షణాలు ఇవే..?
గుండె నొప్పి వచ్చే ముందు ఆడ, మగ ఇద్దరిలో వేర్వేరు లక్షణాలు ఉంటాయని స్మిట్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం తెలిపింది. కార్డియాక్ అరెస్ట్ కేసులలో 90 శాతం మంది ప్రాణాలు కోల్పొతున్నారని, ఈ జాగ్రత్తలు పాటిస్తే భారీ ప్రమాదం తప్పుతుందని తెలిపింది.
Heart attack: ఈ మధ్య ఎక్కడ చూసినా హార్ట్ ఎటాక్(Heart attack)లకు సంబంధించిన వార్తలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై ఎన్నో పుకార్లు వినిపించాయి. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు 90 శాతం మంది మరణిస్తారు. ఏది ఎలా ఉన్నా సమస్యను ముందుగానే గుర్తించే వీలుందని అమెరికాకు చెందిన అధ్యయనం పేర్కొంది. ఈ విషయంలో ఆడ, మగ ఇద్దరికి వేర్వేరు లక్షణాలు ఉంటాయని.. వాటిని గమనిస్తే ప్రమాదం నుంచి బయటపడొచ్చని తెలిపింది. లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం స్త్రీలు కార్డియాక్ అరెస్ట్‌కు ముందు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతారని, పురుషులకైతే ఛాతిలో నొప్పి వస్తుందని వివరించింది. అమెరికాలోని సీడర్స్ సినాయ్ వైద్య కేంద్రానికి (Cedars Sinai Medical Center) చెందిన స్మిట్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఈ అధ్యయనం చేసింది.
కార్డియాక్ అరెస్టు(Cardiac arrest)కు 24 గంటల ముందు 50% మందిలో ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, గుండె లయ తప్పడం వంటి లక్షణాల్లో ఏదో ఒకటి కనిపిస్తుందని, దీనిని మాములు నొప్పిగా తీసుకోవద్దని పేర్కొంది. కొందరు స్త్రీ, పురుషులు గుండె దడకు లోనవుతారని, మూర్చ వచ్చినట్లు అనిపించడం.. ఫ్లూ జ్వరం వంటి లక్షణాలూ కనిపిస్తాయని వెల్లడించింది. వీటితోపాటు రెగ్యూలర్‌గా ఎడమ చేయి గుంజడం, ఎడడ దవడ లాగడం వంటివి కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. దీనితో కార్డియాక్ అరెస్ట్ వల్ల కలిగే ఆకస్మిక మరణాలను నివారించడానికి వీలు ఉంటుందని అధ్యయనంలో భాగస్వాములైన శాస్త్రవేత్త సుమీత్ చగ్ తెలిపారు.