పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. పుష్ప సినిమా విడుదలై ఏడాది అయితే గానీ.. షూటింగ్ మొదలు పెట్టలేదు సుకుమార్. ఈ మధ్యే ఓ ఐదు రోజులు షూటింగ్ చేశామని చెప్పుకొచ్చాడు. అది తప్పితే షూటింగ్ గురించి మరో అప్టేడ్ ఇవ్వలేదు. దాంతో అసలు పుష్పరాజ్ సెట్స్‌లో ఉన్నాడా.. లేడా.. అనే డైలామాలో ఉన్నారు. అయితే ఎట్టకేలకు శ్రీవల్లి బిగ్ అప్డేట్ ఇచ్చేసింది. ఈ సంక్రాంతికి వారసుడు చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది రష్మిక. ఈ నేపథ్యంలో.. ఓ ఇంటర్వ్యూలో పుష్ప ది రూల్ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతుందని క్లారిటీ ఇచ్చేసింది. అయితే తాను మాత్రం ఫిబ్రవరి నుంచి షూటింగ్లో జాయిన్ అవుతానని, ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతగానో ఎదురు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. దాంతో పుష్ప2 షూటింగ్ సైలెంట్‌గా కనిచ్చేస్తున్నారనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. పుష్ప 2లో మెయిన్ విలన్ ఎవరనే విషయంలో క్లారిటీ రావడం లేదు. పార్ట్ వన్‌లో మళయాళ హీరో ఫహాద్ ఫాజిల్‌ను విలన్‌గా ఇంట్రడ్యూస్ చేస్తూ.. ఎండ్ కార్డ్ వేశాడు సుకుమార్. కానీ సెకండ్ పార్ట్‌లో కొత్త విలన్ ఎంట్రీ ఇస్తున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. అది మరెవరో కాదు.. జగపతిబాబును తీసుకున్నారని సమాచారం. గతంలో సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాల్లో విలన్‌గా నటించాడు జగపతి బాబు. అందుకే పుష్ప2లోను ఆయన్నే విలన్‌గా తీసుకున్నట్టు టాక్. ఇకపోతే.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ ఇయర్ ఎండింగ్ లేదా.. నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.