Mla Rk: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) (Mla Rk) మంచి మనస్సు చాటుకున్నారు. అటుగా వెళ్తున్న తన కాన్వాయ్ ఆపి మరీ బోల్తా పడిన ఆటోను లేపేందుకు సాయం చేశారు. ఆయన స్వయంగా చేతులేసి లేపారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.
గుంటూరు జిల్లా పెదవడ్లపూడి రైల్వేస్టేషన్ వద్ద ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణికులు ఉన్నారు.. ఓ గర్భవతి కూడా ఉన్నారు. అటుగా వెళ్తున్న ఆర్కే (Mla Rk) .. వాహనం ఆపారు. మిగతా వారు కూడా వచ్చి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పోలీసులు, స్థానికులు.. తలో చేయి వేశారు. ఆటోను మెల్లిగా పైకి లేశారు. ఆటోలో ఇరుక్కున ఒక్కొక్కరు బయటకు వచ్చారు.
ఆటోలో ఉన్న గర్బిణీని మెల్లిగా బయటకు తీశారు. ఆమెకు ఏమీ కాకపోవడంతో అందరూ హమ్మయ్యా అనుకున్నారు. ఆటో నుంచి బయటపడిన అందరితో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఇటు తెలంగాణలో ఎమ్మెల్యే రాథొడ్ బాపూరావు కూడా సాయం చేశారు. రోడ్డుపై యాక్సిడెంట్ అయిన వారిని ఆస్పత్రికి తరలించారు.