»Prime Minister Modi Recognized The Fallen Flag At The 15th Brics Summit
Modi: ఇది కదా మోడీ దేశభక్తి..కిందపడిన ఫ్లాగ్ తీసిన ప్రధాని
దక్షిణాఫ్రికా(south africa)లో జరుగుతున్న బ్రిక్స్(BRICS) సమ్మిట్‌లో భాగంగా బుధవారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. గ్రూప్ ఫోటో సెషన్ ఫోటోకు పోజులివ్వడానికి వేదికపైకి ఆయా దేశాధినేతలను పిలిచారు. ఆ సమయంలో వేదికపైకి వచ్చిన మోడీ(modi) అక్కడ ఇండియా చిన్న త్రివర్ణ పతాకం కింద పడిఉండటం గమనించారు. వెంటనే దానిని ఎవరూ తొక్కకుండా దానిని తీసుకుని జేబులో పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
Prime Minister Modi recognized the fallen flag at the 15th BRICS summit
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ సదస్సు(brics summit) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇండియాపై ఉన్న దేశభక్తిని మరోసారి ప్రదర్శించారు. అయితే ఆయా దేశాధినేతలు గ్రూప్ ఫోటోకి ముందు మోడీ(modi) వేదికపైకి వెళ్లారు. ఆ క్రమంలో అక్కడ నేలపై చిన్న భారత జెండా ఉండటం గమనించి దానిని ఎవరూ కూడా తొక్కకుండా చూశారు. ఆ నేపథ్యంలో దానిని తీసి జేబులో పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. అంతేకాదు ఆ సమయంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా కూడా మోడీని చూసి అదే పని చేయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మోడీ ఇండియా పట్ల తనకున్న గౌరవాన్ని మరోసారి చూపించారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
#WATCH | Johannesburg, South Africa | PM Narendra Modi notices Indian Tricolour on the ground (to denote standing position) during the group photo at BRICS, makes sure to not step on it, picks it up and keeps it with him. South African President Cyril Ramaphosa follows suit. pic.twitter.com/vf5pAkgPQo
15వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ మూడు రోజుల పర్యటనలో(ఆగస్టు 22, 2023 నుంచి ఆగస్టు 24, 2023) భాగంగా దక్షిణాఫ్రికా(south africa) చేరారు. BRICS వివిధ రంగాలలో బలమైన సహకార ఎజెండాను పాటిస్తోంది. అభివృద్ధి, బహుపాక్షిక వ్యవస్థ సహా పలు సంస్కరణలతో మొత్తం గ్లోబల్ సౌత్‌కు సంబంధించిన సమస్యలపై చర్చించడానికి BRICS ఒక వేదికగా మారింది. భవిష్యత్తులో సహకార రంగాలను గుర్తించడానికి, సంస్థాగత అభివృద్ధిని సమీక్షించడానికి బ్రిక్స్‌కు ఉపయోగకరమైన అవకాశమని పిఎంఓ ఇప్పటికే తెలిపింది.
గ్లోబల్ మీట్ మొదటి రోజు భారతదేశం(india) త్వరలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని, రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి ఇంజిన్ అవుతుందని ప్రధాని మోదీ అన్నారు. బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లీడర్స్ డైలాగ్‌లో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇండియా పీఎం నరేంద్ర మోడీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పాల్గొన్నారు.