బీజేపీలో చేరడం అంటే.. ఆత్మహత్య చేసుకున్నట్లే అంటూ… మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జనవరి 18వ తేదీన ఖమ్మంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సభ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో… ఆయన ప్రతిపక్షం పై విమర్శల వర్షం కురిపించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతం అయినట్లేనని, బీజేపీలో చేరినవాళ్లు ఆత్మహత్య చేసుకున్నట్లేనని మంత్రి హరీశ్ రావు అన్నారు.మతతత్వ పార్టీలకు ఇక్కడ ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఖమ్మంలో జరిగిన ప్రగతి విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. ఖమ్మం వచ్చినప్పుడల్లా కొన్ని నేర్చుకొని పోతున్నానని తెలిపారు. లకరం, డివైడర్, చెట్లు అన్నీ ఫోటోలు తీసుకొని తన ప్రాంతాన్ని అలానే అభివృద్ధి చేసుకున్నానని హరీశ్ రావు గుర్తుచేశారు.
పాత ఖమ్మంకు ఇప్పటి ఖమ్మంకు పోలికే లేదని హరీశ్ రావు అన్నారు. ఒక్క ఖమ్మంలో మాత్రమే 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని హరీశ్ రావు గుర్తుచేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమని, ముచ్చటగా మూడోసారి కూడా కారు పార్టీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.