The more expensive the wedding, the higher the risk of divorce, according to the latest American study
Wedding: పెళ్లంటే(Marriage) జీవితంలో ముఖ్యమైన ఘట్టం. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరూ భారీగా ఖర్చుపెట్టి చేసుకుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటివి అయితే కోట్లతో వ్యవహారం. ఇంకా కొంత అప్పులు చేసి పెళ్లిలో గొప్పలకు పోతారు. చాలా తక్కువ మంది పొదుపుగా ఖర్చుచేస్తారు. ఇదే విషయంపై అమెరికాలో ఒక అధ్యయనం(American study) జరిగింది. దీని సారంశాన్ని తెలుసుకన్న తరువాత పెళ్లి ఖర్చుపై మీ అభిప్రాయం మారుతుంది. వివాహంలో తక్కువ ఖర్చు చేస్తే వారి జీవితం అంత సాఫీగా సాగుతుందని, వారు ఎక్కువకాలం కలిసి ఉంటారని పేర్కొంది. అమెరికాకు చెందిన ఎకనమిక్స్ ప్రొఫెసర్లు ఆండ్రూ ఫ్రాన్సిస్, హుగో మియాలన్ 3,000 మందికి పైగా వివాహాలను విశ్లేషించారు. వీరి అధ్యయన నివేదికను సీఎన్ఎన్ వెలుగులోకి తెచ్చింది. వివాహానికి ఎంత ఎక్కువ ఖర్చు పెడితే, విడాకుల రిస్క్ అంతగా పెరుగుతుందని ఈ పరిశోధకులు తేల్చారు.
2,000 డాలర్ల నుంచి 4,000 డాలర్ల మధ్య నిశ్చితార్థం రోజున వేలి ఉంగరం కోసం ఖర్చు పెట్టిన వారిలో విడాకుల రిస్క్.. 500-2000 డాలర్ల మధ్య ఖర్చు పెట్టి న వారితో పోలిస్తే 1.3 రెట్లు అధికంగా ఉంటున్నట్టు గుర్తించారు. 1,000 డాలర్ల కంటే తక్కువ వ్యయంతో పెళ్లి చేసుకున్న వారిలో విడాకుల అవకాశాలు.. 20,000 డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టే వారితో పోలిస్తే తక్కువ. 20వేల డాలర్లకు మించి ఖర్చు చేసే వారిలో విడాకుల రిస్క్ 1.6 రెట్లు అధికంగా ఉంటుంది. హనీమూన్ కు చేసిన ఖర్చు ఫలితాన్ని ఇస్తుందని పరిశోధకులు గుర్తించారు. పెళ్లయిన తర్వాత దంపతులు తమకు నచ్చిన చోటకి వెళ్లి రావడం వల్ల భవిష్యత్తులో విడాకుల రిస్క్ తగ్గుతుందని తెలిపారు.