»Himachal Pradesh Flood Disaster Railway Track Hangs In Air Soil Washed Away Heavy Rainfall
Himachal rains: వరద బీభత్సం..గాల్లో తేలాడుతున్న రైల్వే ట్రాక్
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా స్తంభించిన జనజీవనం. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రవాణవ్యవస్థ. భారీ వరదల కారణంగా రైల్వే ట్రాక్‌పై మట్టి అంత కొట్టుకుపోయి రైల్ట్రాక్స్ గాల్లో తేలి ప్రమాదకరంగా మారాయి. చూడడానికే ఒల్లు గగుర్లుపొడిచేలా ఉన్న ఈ దృష్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి.
Himachal Pradesh flood disaster.. Railway Track Hangs In Air, Soil Washed Away Heavy Rainfall
Heavy Rainfall: గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో భారీ వర్షాలు(Heavy Rainfall) కురుస్తున్నాయి. వరద బీభత్సంతో(floods disaster) ప్రాణ నష్టంతో పాటు వేలకోట్లలో ఆస్తినష్టం జరుగుంది. అంతే కాకుండా రహదారులు అన్ని కట్టుకుపోయాయి. అదేవిధంగా భూమి కొట్టుకుపోవడంతో రైల్వే ట్రాక్‌లు( Railway Track) గాలిలో వేలాడుతున్నాయి(Hangs In Air ). దీనికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. భారీ వర్షాలు సిమ్లాలో సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని, కొండచరియలు విరిగిపడటం, విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో విద్యుత్తు సరఫరా లేదని అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో 621 రోడ్లు మూసివేశారు.
గత మూడు రోజుల్లో 71 మంది మరణించారు. అంతే కాకుండా కొండచరియలు విరిగిపడంతో కొంతమంది అందులో చిక్కుకున్నారు. వారిని కాపడానికి ప్రయత్నించే వారిపై కూడా కొండచెరియల ప్రభావం ఉండడంతో ఆ ప్రయత్నాలు విరమించుకుంటున్నారు. ఇప్పటికే దీన్ని జాతియ విపత్తుగా ప్రకటించి కేంద్రం ఆదుకోవాలని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhwinder Singh Sukh) వెల్లడించారు. NDRF బృందాలు కొండ ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇక వరదల కారణంగా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద సిమ్లా-కల్కా రైలు మార్గం సమ్మర్ హిల్ సమీపంలో 50 మీటర్లు కొట్టుకుపోయింది. ట్రాక్స్లోని మట్టి కంకర కొట్టుకుపోయి, పట్టాలు వంతెనాల తేలియాడుతున్నాయి. ప్రస్తుతం దీనికిి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Rail track washed away in Shimla, Himachal Pradesh after cloudburst leaves 9 dead and 15 missing.