ADB: అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చునని డాక్టర్ నిఖిల్ రాజ్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం భీంపూర్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలైంగిక సంబంధాలు, కలుషిత ఇంజక్షన్, హెచ్ఐవీతో కూడిన రక్తమార్పిడి ద్వారా వ్యాధి సంక్రమిస్తుందని తెలియజేశారు.