TG: తన వాచ్ ధరపై జరుగుతున్న ట్రోలింగ్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. తాను ధరించిన వాచ్ బ్రాండ్ పేరు మైకేల్ కోర్స్ అని చెప్పారు. ఈ వాచ్ ధర రూ. 10-40 వేల వరకు ఉంటుందని స్పష్టం చేశారు. ఇది కూడా తనకు గిఫ్ట్‌గా వచ్చిందేనని తెలిపారు. కానీ సోషల్ మీడియాలో BRS నేతలు రూ.కోటి విలువైన రోలెక్స్ వాచ్‌గా చూపుతున్నారని మండిపడ్డారు.