సినీ నటి నయనతారపై తమిళనాడులో అన్నాడీఎంకే ఎంపీ చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళల గౌరవం కోసం చేపట్టిన నిరసనలోనే ఆయన.. ‘కలాం గారు కలలు కనమన్నారు. మా CM స్టాలిన్ కూడా కలలు కంటే తీరుస్తా అంటున్నారు. నాకు నయనతార కావాలని కల వస్తే ఆయన తీరుస్తారా?. నయనతారతో పెళ్లి చేయమని అడిగితే చేస్తారా?’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.