»Chandrayaan 3 In The Last Orbit Of The Moon Isro Revealed The Key Facts
ISRO: చంద్రుడి చివరి కక్ష్యలోకి చంద్రయాన్-3.. కీలక అంశాలు చెప్పిన ఇస్రో
చంద్రయాన్-3 ప్రయోగం చివరి దశలో ఉంది. ప్రస్తుతం చంద్రుడి చివరి కక్ష్యలోకి ప్రవేశించిన ల్యాడర్ ఆగస్టు 17వ తేదిన మరో కీలక ఘట్టానికి చేరుకుంటుంది. ఈ మేరకు ఇస్రో కీలక అంశాలను ట్వీట్ చేసింది.
Chandrayaan-3 Lander Shares Its First Video From Moon's Surface
ISRO: చంద్రయాన్-3 (Chandrayaan-3)ని ప్రయోగించి భారత్ అంతరిక్ష పరిశోధనలో ఓ అడుగు ముందుకేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ విజయవంతంగా దూసుకెళ్తున్న మిషన్ ప్రస్తుతం మరో ఫీట్‌ను సాధించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి ప్రవేశపెట్టిన చంద్రయాన్-3(Chandrayaan-3) ఒక్కో కక్ష్యను దాటుకుంటూ విజయంతంగా దూసుకెళ్తోంది. తాజాగా చంద్రుడికి మరింత చేరువగా వెళ్లిందని ఇస్రో(ISRO) బుధవారం ఉదయం ట్వీట్ చేసింది. ఉదయం 8.30 గంటలకు చంద్రయాన్ -3 నాలుగోసారి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టేందుకు చంద్రయాన్-3కి ఇదే చివరి కక్ష్య. చంద్రునిపైకి వెళ్లడానికి చంద్రయాన్3కి మరో 153 కిలో మీటర్లు మాత్రమే ఉంది. ఫలితంగా చంద్రయాన్-3 చంద్రుడికి 100 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది.
ఈ నేపథ్యంలో ఆగస్టు 17న ఈ ప్రయోగంలో ఇస్రో (ISRO) కీలక ఘట్టాన్ని చేపట్టనుంది. గురువారం వ్యోమనౌకలోకి ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది. ఈ ప్రక్రియ సజావుగా జరిగితే ల్యాండింగ్ మాడ్యూల్ విడిపోయి సొంతంగా చంద్రుడిని చుట్టేస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈనెల 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ చంద్రుడిపైకి అడుగుపెట్టనుంది. చంద్రుడి ఉపరితలం మీదకు సమీపిస్తున్నప్పుడు ల్యాండర్ వేగాన్ని సమాంతరం నుంచి వర్టికల్ దిశగా మార్చడమనేది చాలెంజింగ్ విషయం. 30 కిలో మీటర్ల కక్ష్య నుంచి ల్యాండర్ వేగాన్ని తగ్గిస్తూ విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది సక్సెస్ అయితే చంద్రుడి దక్షిణ దృవంపై ల్యాండర్‌ను ప్రవేశపెట్టిన మొదటి దేశంగా ఇండియా చరిత్రలో నిలిచిపోతుంది. అంతేకాకుండా చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు చేయడానికి ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుంది. జులై 14న శ్రీహరి కోట నుంచి ఇస్రో చంద్రయాన్-3ని ప్రయోగించిన విషయం తెలిసిందే.
Chandrayaan-3 Mission:
Today’s successful firing, needed for a short duration, has put Chandrayaan-3 into an orbit of 153 km x 163 km, as intended.
With this, the lunar bound maneuvres are completed.