Atharvaa Murali: హీరోయిన్ అమలాపాల్ (Amala Paul) గురించి తమిళ హీరో అథర్వ మురళి (Atharvaa Murali) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమలాపాల్ ఓ చెత్త హీరోయిన్ అని పేర్కొన్నారు. తనతో కలిసి నటించిన హీరోయిన్లలో అమలాపాల్ (Amala Paul) వరస్ట్ అని తెలిపారు. అథర్వ మురళి (Atharvaa Murali) చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్కసారిగా చర్చకు దారితీసింది.
తన రెండో మూవీలో అమలాపాల్ (Amala Paul) హీరోయిన్ అని మురళి చెబుతున్నారు. షూటింగ్ స్టార్ట్ అయిన కొద్దీరోజుల్లో తమ మధ్య గొడవ జరిగిందని వివరించారు. తర్వాత అది సెట్ అయ్యిందని తెలిపారు. ఆమె ఓ చెత్త హీరోయిన్ అని అప్పుడే తనకు చెప్పానని తెలిపారు. అథర్వతో (Atharvaa) పోలిస్తే అమలాపాల్ (Amala Paul) క్రేజీ హీరోయిన్.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ పేరు ఉన్న నటి.. సమయానికి అనుగుణంగా గ్లామర్ రోల్స్ కూడా చేస్తోంది. ఇటీవల బోల్డ్ పాత్రలను కూడా అంగీకరిస్తోంది.
అమలాపాల్ (Amala Paul) అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అథర్వ మురళి (Atharvaa Murali) తెలుగులో గద్దలకొండ గణేశ్ మూవీలో నటించారు. వరుణ్ తేజతో కలిసి కీలకమైన పాత్ర చేశాడు. ప్రస్తుతం మధకం అనే వెబ్ సిరీస్లో చేశాడు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుండగా.. ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఆ సమయంలోనే అమలాపాల్ (Amala Paul) గురించి మాట్లాడారు. అథర్వ మురళి (Atharvaa Murali) చేసిన కామెంట్స్ చర్చకు దారితీసింది. దీనిపై అమలాపాల్ (Amala Paul) ఎలా రియాక్ట్ అవుతారో చూడాలీ.