»Why Actor Karnataka College Students Purify Thier Campus With Cow Urine After Actorprakash Raj Visit
Prakash Raj: ప్రకాశ్ రాజ్ సందర్శించిన కాలేజీని గో మూత్రంతో శుద్ధి చేసిన స్టూడెంట్స్
కళాశాల విద్యార్థులు ప్రకాశ్ వచ్చి వెళ్లిన తర్వాత గోమూత్రంతో క్యాంపస్‌ను శుభ్రం చేసినట్లు సమాచారం. ‘డైలాగ్ ఆన్ థియేటర్, సినిమా అండ్ సొసైటీ’ అనే అంశంపై కళాశాలలోని ఓ హాలులో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్.. దీనికి కళాశాల విద్యార్థులను ఆహ్వానించలేదు.
Prakash Raj:విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీని తన నటనతో కట్టి పడేసే వ్యక్తి. ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లో కూడా విలన్ పాత్రల్లో మెప్పిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. అలాంటి వ్యక్తి ఓ కాలేజీని ఇటీవల సందర్శించారు. ఆయన వచ్చిపోయాక విద్యార్థులు గోమూత్రంతో కాలేజీని శుద్ధి చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కర్ణాటకలోని శివమొగ్గలోని ఎంవీ కాలేజీకి ఒక కార్యక్రమం కోసం ప్రకాశ్ రాజ్ వచ్చారు. కళాశాల విద్యార్థులు ప్రకాశ్ వచ్చి వెళ్లిన తర్వాత గోమూత్రంతో క్యాంపస్‌ను శుభ్రం చేసినట్లు సమాచారం. ‘డైలాగ్ ఆన్ థియేటర్, సినిమా అండ్ సొసైటీ’ అనే అంశంపై కళాశాలలోని ఓ హాలులో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్.. దీనికి కళాశాల విద్యార్థులను ఆహ్వానించలేదు.
ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ క్యాంపస్‌లో ప్రైవేట్ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారని విద్యార్థులు ప్రశ్నించారు. విద్యార్థులే కాకుండా పలువురు ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించారు. విషయం తీవ్రరూపం దాల్చడంతో విద్యార్థులు, బయటి వ్యక్తులను కళాశాలలోకి రాకుండా పోలీసులు బారికేడ్లు వేసి అడ్డుకున్నారు. నిరసనకారుల్లో విద్యార్థులు, బయటి వ్యక్తులు కూడా ఉన్నారని శివమొగ్గ ఎస్పీ తెలిపారు. బయటి వ్యక్తులు ఇక్కడికి రావడానికి గల కారణాలు తెలియరాలేదు. ఇటీవల ప్రకాష్ రాజ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మతం పేరుతో ప్రజలను బీజేపీ భయపెడుతుందని ఆయన చాలా సందర్భాల్లో అన్నారు. 2017లో ప్రకాష్ రాజ్ చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది.