రొమంటిక్ రిలేషన్ (romantic relationship) మంచి ఆరోగ్యాన్ని ఎక్కువ కాలం పాటు జీవించేందుకు సహకరిస్తాయని వివిధ అధ్యయనాలలో తేలాయి. బెన్నీ షేక్స్ (Benny Shakes) తన ఫ్రెండ్స్ విషయానికి వచ్చే సరికి చాలా తక్కువ టైమ్ కేటాయించే వారు. అన్ని సార్లు కూడా నేను నా స్నేహితులతో గడిపే సమయాన్ని రద్దు చేసుకునే వాణ్ని’’ అని బెన్నీ షేక్స్ తెలిపారు.బెన్నీ షేక్స్ బ్రిటన్(Britain)లో నాటింగ్‌హామ్‌లో స్టాండప్ కమెడియన్. ఆయన చేసే ఈ పనిలో చాలా ఎనర్జీ అవసరం.బెన్నీ మానసిక ఆరోగ్య సమస్యలు, పాక్షిక పక్షవాతంతో బాధపడుతున్నారు. బెన్నీ షేక్స్ తన స్నేహితుడు మార్క్ నికోలస్(Mark Nicholas)తో కలిసి కరోనా మహమ్మారి సమయంలో ఇతర డిజేబుల్డ్ కమెడియన్లు, కళాకారులతో కలిసి గ్రూప్ చాట్ ఏర్పాటు చేశారు.
ఈ గ్రూప్ చాట్(Group chat)తో ప్రస్తుతం తాము ఎప్పుడైనా ఎవరైనా బాధలో ఉంటే లేదా అవసరమైన వారికి 25 మంది వరకు తాము సాయం చేస్తున్నామన్నారు.ప్రతి ఒక్కరం ఒకరికొకరం సాయపడతామని వివరించారు. షేక్స్ జీవిత అనుభవాలు చాలా ప్రత్యేకం.స్నేహం రూపంలో ఫ్రెండ్స్ నుంచి ఆయనకు లభించిన తోడుతో, ఒంటరి అనే ఫీలింగ్ (feeling) నుంచి షేక్స్ బయటపడ్డారు.చికాకుగా ఆందోళనలో ఉన్న మన మనసును తేలికపరచడం నుంచి గుండెకు మంచి చేయడం వరకు శరీరానికి, మనసుకు స్నేహబంధాలు పలు రకాల ప్రయోజనాలను అందిస్తున్నాయి.శృంగార, కుటుంబ సంబంధాల కంటే తక్కువగానే మనం స్నేహబంధాలకు విలువ ఇస్తున్నప్పటికీ, వీటి నుంచి ప్రయోజనాలను మాత్రం విలువ కట్టలేనివి.