తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) ఇటివల యాక్ట్ చేసిన చిత్రం 'జైలర్' మూవీ ఆగస్ట్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే..రజినీ నెక్ట్స్ మూవీ గురించి క్రేజీ బజ్ మొదలైంది. తలైవర్ 170వ చిత్రంలో అనేక మంది స్టార్ హీరోలు యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Before Jailer movie the buzz rajinikanth son Thalaivar 170th movie multi starrer movie
స్టార్ హీరో రజినీకాంత్(rajinikanth) జైలర్ మూవీ విడుదల కాకముందే తన 170వ చిత్రానికి సంబంధించిన అప్ డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. ఇవి తెలిసిన అభిమానులను ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజా(gnanavel raja) డైరెక్షన్ చేయనున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జై భీమ్ ఇప్పటికే విడుదలై భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ మూవీపై మరింత క్రేజ్ మొదలైంది. ఈ 170 మూవీని లైకా సంస్థ నిర్మిస్తోంది.
అంతేకాదు ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), తెలుగు హీరో నాని(nani), ఫహద్ ఫాసిల్(Fahadh Faasil), భగత్ బాసిల్, మంజు వారియర్ యాక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే 32 సంవత్సరాల విరామం తర్వాత అమితాబ్ బచ్చన్, రజినీకాంత్‌లు మళ్లీ కలిసి నటించనున్నారు. ఈ మల్టీ-స్టార్ టీమ్ ఎంపిక గురించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిసింది.
ఈ మూవీకి అనిరుధ్(anirudh) సంగీతం అందించనున్నాడని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి అప్డేట్లతో షూటింగ్ ప్రారంభం కాకముందే విడుదల తేదీని ప్లాన్ చేసింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ 50 రోజుల కాల్షీట్ ఇచ్చారని, అప్పటికి సింగిల్ పర్సన్ గా రజనీకి సంబంధించిన సీన్స్ షూట్ చేయబోతున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీని ఈ చిత్రాన్ని 2024 వేసవిలో విడుదల చేయనున్నారు. మరోవైపు రజినీకాంత్ తన 171వ చిత్రం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేయనున్నట్లు సమాచారం.