»Congress Leader Amarinder Singh Raja Warring Over Ac Not Working In The Indigo Flight Distribution Of Tissues
Viral video: ఫ్లైట్‌లో పనిచేయని ఏసీ..టిష్యూల పంపిణీపై కాంగ్రెస్ నేత ఆగ్రహం
గతంలో కొన్నిసార్లు విమానాన్ని పక్షి ఢీకొన్న సందర్భాలు చుశాం. మరికొన్ని సార్లు సాంకేతిక లోపం కారణంగా విమానం కిందకు దిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇటివల మరో ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇండిగో విమానంలో ఏసీ(AC) పనిచేయకపోవడంతో(not working) ప్రయాణికులు 90 నిమిషాల పాటు ఇబ్బంది పడాల్సి వచ్చిందని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇండిగో విమానానికి సంబంధించిన వీడియోను ఈ మేరకు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా(Amarinder Singh Raja) శనివారం “ఇండిగో విమానం(indigo flight) 6E7261లో చండీగఢ్ నుంచి జైపూర్‌కు ప్రయాణించారు. ఆ క్రమంలో తనకు ఏదురైన వింత అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాను ప్రయాణించిన సమయంలో ఫ్లైట్‌లో ఏసీ(AC) లోపం కారణంగా పనిచేయలేదని పేర్కొన్నారు. ఆ క్రమంలో ప్రయాణికులకు దాదాపు 90 నిమిషాలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆ క్రమంలో ఇండిగో ఫ్లైట్‌లో ప్రయాణికులు చెమట తుడుచుకోవడానికి సిబ్బంది టిష్యూ ఇచ్చారని, కానీ ఏసీ రిపేర్ చేయించలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందుగా ప్రయాణికులను మండే ఎండలో 10-15 నిమిషాల పాటు లైన్లో వేచి ఉండేలా చేశారని, ఆపై ఏసీ లేకుండానే విమానం(flight) బయలుదేరిందని అమరీంద్ సింగ్ చెప్పారు. ఆ క్రమంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)లను ట్యాగ్ చేస్తూ అమరీందర్ సింగ్ రాజా ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Had one of the most horrifying experiences while traveling from Chandigarh to Jaipur today in Aircraft 6E7261 by @IndiGo6E. We were made to wait for about 10-15 minutes in the queue in the scorching sun and when we entered the Plane, to our shock, the ACs weren't working and the… pic.twitter.com/ElNI5F9uyt
— Amarinder Singh Raja Warring (@RajaBrar_INC) August 5, 2023
ఇండిగో(indigo) విమానంలో ఇలాంటి సాంకేతిక లోపం సంభవించడం ఇది మూడవది కావడం విశేషం. శుక్రవారం ఢిల్లీ వెళ్లే ఇండిగో విమానాన్ని పాట్నాలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం టేకాఫ్ అయిన మూడు నిమిషాల తర్వాత అత్యవసర ల్యాండింగ్ జరిగింది. ఈ విమానం ఉదయం 9.11 గంటలకు పాట్నాలోని జై ప్రకాష్ నారాయణ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే ఢిల్లీ నుంచి రాంచీకి తిరిగి వస్తున్న మరో విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం టేకాఫ్ అయిన అరగంట తర్వాత, పైలట్ ఈ విషయాన్ని ప్రకటించారు. విమానాన్ని తిరిగి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువెళుతున్నట్లు వెల్లడించారు.