»Alluarjun In The Election Campaign A Firm Plan For Uncle
Alluarjun: ఎన్నికల ప్రచారంలోకి అల్లుఅర్జున్..మామ కోసం గట్టి ప్లాన్!
టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్ తెలంగాణలో ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొనబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తమ మామ చంద్రశేఖర్ రెడ్డి కోసం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున బన్నీ ప్రచారం చేపట్టనున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్(Allu arjun) ఎన్నికల ప్రచారం (Election Campaigning) చేయనున్నారు. ప్రస్తుతం ఆయన పుష్ఫ2 సినిమా (pushpa 2 Movie) షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఈ గ్యాప్‌లో బన్నీ తన మామ కోసం గట్టి ప్లానే వేసినట్లు తెలుస్తోంది. అల్లుఅర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి (chandrasekhar Reddy) తెలంగాణలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార రంగంలో తిరుగులేని చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నారు.
నాగార్జున సాగర్ (Nagarjuna sagar) నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యే టిక్కెట్‌ను ఆశిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే అన్ని రకాలుగా ప్రణాళికలు వేస్తున్నారు. బీఆర్ఎస్లో చురుకైన నేతగా పలుకుబడి సాధించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రచారాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఆయన నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని, అలాగే ఓ ఫంక్షన్ హాల్‌ను కూడా నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ విషయంపై నియోజకవర్గంలో జోరుగా చర్చ సాగుతోంది. రాబోవు ఎన్నికల(Elections) కోసం కార్యకర్తలతో కలిసి చంద్రశేఖర్ రెడ్డి ప్రచారాన్ని చేపట్టనున్నారు. అలాగే తన అల్లుడు అల్లుఅర్జున్ను(Allu arjun) రంగంలోకి దింపనున్నారు. ఆగస్టు 19వ తేదిన బన్నీ చేతుల మీదుగా ఫంక్షన్ హాల్, పార్టీ కార్యాలయం ప్రారంభం కానుందని నియోజకవర్గంలో పలువురు గుసగుసలాడుకుంటున్నారు.
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అల్లుఅర్జున్(Allu arjun) మామగారి కోసం ఎన్నికల ప్రచారం(Election Campaigning) చేపట్టే అవకాశం ఎక్కువగానే ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అలాగే బన్నీ ఎన్నికల ప్రచారానికి ముందుగా ‘మెగా మీల్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు దాదాపుగా 10,000 మంది హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంత వరకూ ప్రకటన రాలేదు. త్వరలోనే దీనికి గురించి ఓ క్లారిటీ రానుంది.