అన్నమయ్య: ఓబుళవారిపల్లికి చెందిన పాత్రికేయుడు పొన్న వెంకటరమణయ్య 22 ఏళ్లుగా మీడియా రంగంలో సేవలందించారు. 2022 ఫిబ్రవరి 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు. ఒకప్పుడు మీడియాకు సేవలందించిన ఆయన ఇప్పుడు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. పాత్రికేయుల సంక్షేమం కోసం పోరాడే యూనియన్లు తన కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.