అన్నమయ్య: రాయచోటి ఎన్జీవో కాలనీలో 8వ తరగతి విద్యార్థిని లావణ్య (13) అనుమానాస్పదంగా సోమవారం మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ నరసింహ కుమార్, ఎంఈవో బాలాజీ నాయక్ వివరాలు సేకరించారు. మృతదేహాన్ని రాయచోటి ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.