బ్రహ్మాస్త్ర ఈవెంట్ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా జరగాల్సి ఉండగా.. తర్వాత రద్దు అయ్యి.. వేరే ప్లేస్ జరగాల్సి వచ్చింది. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి క్షమాపణలు కూడా చెప్పారు. దీని సంగతి ప్రస్తుతం అందరూ మర్చిపోయారు. కానీ… ఇలా ఈవెంట్ క్యాన్సిల్ అయ్యి.. ప్లేస్ మార్చడంలో రాజకీయంగా చాలా పెద్ద కుట్రే జరిగిందనే ప్రచారం ఇప్పుడు మొదలైంది. అది కూడా ఎన్టీఆర్ కారణంగానే ఇలా జరిగిందంటూ ప్రచారం మొదలవ్వడం గమనార్హం.
ఇంతకీ మ్యాటరేంటంటే…. ఈమధ్యనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో జూనియర్ భేటీ అయిన విషయం తెలిసిందే. వీళ్ళ భేటీకి ముందు అమిత్ షా రామోజీ ఫిల్మ్ సిటీలోని రామోజీ ఇంటికి వెళ్ళొచ్చారు.
అంటే అమిత్ ఇటు రామోజీ అటు జూనియర్ తో ఒకేరోజు భేటీ అవ్వటం రాజకీయంగా బాగా హీటెక్కించింది. ఈ రెండు భేటీలు కచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉండటం కోసమే జరిగిందనే ప్రచారం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో జూనియర్ ను బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయమని అమిత్ అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ సమాధానం ఏమిటనేది తెలీకపోయినా రాజకీయంగా మంటలు మాత్రం పెరిగిపోతున్నాయి.
ఇపుడు జూనియర్ ఫంక్షన్‌ను కేసీయార్ ప్రభుత్వం నూరుశాతం రాజకీయంగా చూస్తున్నది కాబట్టే సినిమా ఫంక్షన్ కు అనుమతిచ్చినట్లే ఇచ్చి ప్రభుత్వం మళ్ళీ క్యాన్సిల్ చేసిందనే ఆరోపణలు, ప్రచారం పెరిగిపోతోంది. పోలీసులు ముందు అనుమతి ఎందుకు ఇచ్చారో చివరినిముషంలో ఎందుకు రద్దుచేశారో వాళ్ళకే తెలియాలి. ఏదేమైనా ఫంక్షన్ ప్రోగ్రామ్ రద్దవటం మాత్రం రాజకీయంగా మంటలు రేపుతోంది.