సాధారణంగా మహిళలకు సీమంతం (Simantam) చేస్తుంటారు. కానీ ఇటీవలికాలంలో పెంపుడు జంతువులకు కూడా సీమంతం చేస్తున్నారు. గతంలో కొంతమంది ఆవులు, పిల్లులకు కూడా సీమంతం చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే తాజాగా పెంపుడు కుక్క(Pet dog) కు ఓ మహిళ సీమంతం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్ అయింది. ఓ జంతు ప్రేమికుడు తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కకు సీమంతం చేసిన ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. . కర్ణాటకలోని గదగ్ జిల్లా లక్ష్మేశ్వర్లో నివసించే జంతుప్రేమికుడు అశోక్ (Ashok) తన ఇంట్లో కుక్కకు సీమంతం చేయగా.. ఇరుగు పొరుగు మహిళలు వచ్చి హారతులిస్తూ వేడుక జరిపించారు. ఈ వీడియో వైరల్ (video viral) అవుతోంది.
కర్ణాటకలోని గదగ్ జిల్లాలో జంతు ప్రేమికుడు అశోక్ తన ఇంట్లో కుక్కకు సీమంతం చేయగా.. ఇరుగు పొరుగు మహిళలు వచ్చి హారతులిస్తూ వేడుక జరిపించారు. pic.twitter.com/HVpE0yCoW9