బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగిన్ సీరియల్లో ఆమె నటనకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ సీరియల్ తర్వాత ఆమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా గత ఏడాది బ్రహ్మాస్త్ర సినిమాలో ఆమె ప్రధాన విలన్ పాత్రలో నటించింది. తాజాగా ఆమె ఆస్పత్రిలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెను ఆస్పత్రి బెడ్‌పై చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
మౌనీకి ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. సాధారణంగా సినీ తారల వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటాయి. మౌనీ రాయ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుపుతూనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్న ఫోటోలను కూడా షేర్ చేసింది. అదేవిధంగా ఆస్పత్రిలో ఆమె గడిపిన క్షణాలను ఫోటోలు తీసి షేర్ చేసింది. ఫోటోలతో పాటు ఓ నోట్‌ను రాసుకొచ్చింది.
ఆస్పత్రిలో తాను ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. 9 రోజులు ఆస్పత్రిలో ఉన్నానని, అలా ఎప్పుడూ నిశ్చలంగా లేనని, అయితే తాను కోలుకున్నానని, నెమ్మదిగా తన ఆరోగ్యం కుదుటపడిందని తెలిపింది. ఇప్పుడు తాను చాలా ఆనందంగా ఉంటున్నట్లు వెల్లడించింది. తనను చాలా జాగ్రత్తగా చూసుకున్న మెడికల్ స్టాఫ్‌కు సన్నిహితులకు ధన్యవాదాలు తెలిపింది. తన భర్త నంబియార్ తనను బాగా చూసుకున్నాడని నోట్లో రాసుకొచ్చింది.