W.G: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు కొండంత అండ అని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. శనివారం 34 మంది లబ్ధిదారులకు రూ. 27,15,924 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఇప్పటివరకు 35 విడతల్లో మొత్తం 576 మందికి రూ. 4.79 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించామని వివరించారు. రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హత ఆధారంగానే ఈ నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.