»Kg Ginger Price Rs 400 Surpasses Tomato Rates At Karnataka
Ginger: టమాటా రేట్లను మించిపోయిన అల్లం ధర
టొమాటో తర్వాత ఇప్పుడు అల్లం(Ginger) కూడా రేటు విషయంలో పోటీ పడుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఏకంగా కిలో అల్లం ధర రూ.400కు చేరింది. బహిరంగ మార్కెట్లలో కొనసాగుతున్న ఈ ధరల పట్ల మధ్యతరగతి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇలా రేట్లు పెరిగితే చాలిచాలని జీతంతో జీవనం ఎలా కొనసాగించాలని పలువురు వాపోతున్నారు.
ప్రస్తుతం దేశం మొత్తం మీద టమాటా రేట్ల పెరుగుదలతో మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే జాబితా కొత్తగా అల్లం(Ginger)చేరింది. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుతం కర్ణాటకలో కిలో అల్లం రూ.400 పలుకుతోంది. భారతదేశంలో అల్లం ఉత్పత్తిలో కర్ణాటక రెండవ స్థానంలో ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో అల్లం ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో కొనసాగుతుంది. మొదటి స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కర్ణాటక(karnataka)లో చాలా చోట్ల రిటైల్ మార్కెట్ లో కిలో అల్లం రూ.300 నుంచి 400 వరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో 60 కిలోల అల్లం పొడిని రూ.11,000కు విక్రయిస్తున్నట్లు కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం మైసూరు జిల్లా యూనిట్ తెలిపింది. గత సంవత్సరం వరకు దీని ధర 2000 నుంచి 3000 వేల రూపాయలు ఉండేది. హోల్సేల్ మార్కెట్లో ధర పెరగడంతో రిటైల్ మార్కెట్లో కూడా ఆటోమేటిక్గా రెట్లు పెరిగినట్లు చెబుతున్నారు. అయితే అల్లం ధర పెరగడం మైసూరు, మల్నాడు జిల్లాల రైతులకు వరంగా మారుతోంది. ఇక్కడ రైతులు, రైతులు అధికంగా సంపాదిస్తున్నారు. దీంతో ఉభయ జిల్లాల రైతులు పెద్ద ఎత్తున వీటిని సాగు చేశారు. ఇప్పటికే కిలో 20 నుంచి 30 రూపాయలకు విక్రయించే టమాటా ధర దేశవ్యాప్తంగా 150 నుంచి 250 రూపాయలకు పెరిగింది. పచ్చిమిర్చి కిలో రూ.200లకు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా కర్నాటకలోని ఓ రైతు తన పొలంలో రూ.1.8 లక్షల విలువైన పళ్లు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారు. ఇదే కాకుండా పలువురు రైతులు చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.