కోలీవుడ్ విజయ్ నటిస్తున్న వారసుడు సినిమా విషయంలో మహేష్, చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టే కనిపిస్తోంది. అయితే తమిళ్ హీరో సినిమాకు వీళ్లెందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నారనే డౌట్ రాక మానదు. రీసెంట్గా రిలీజ్ అయిన వారసుడు ట్రైలర్.. తెలుగు ఆడియెన్స్‌కు ఏ మాత్రం ఎక్కలేదు. ట్రైలర్ అలా రిలీజైందో లేదో.. వెంటనే ట్రోల్స్ మొదలైపోయాయి. ఇప్పటికే తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయని కామెంట్స్ చేస్తున్నారు. అందుకే మహేష్, చరణ్ ఫ్యాన్స్ హ్యాపీ అంటున్నారు. ఈ సినిమాను ముందుగా మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు దిల్ రాజు. అలాగే రామ్ చరణ్‌తో కూడా చేయడానికి ట్రై చేశామని చెప్పుకొచ్చాడు. అయితే ఇతర కమిట్మెంట్స్ వల్ల వాళ్లు ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పారు. ఇక ఇప్పుడు ట్రైలర్ చూశాక రిజెక్ట్ చేసి మంచి పని చేశారని అంటున్నారు ఫ్యాన్స్. లేదంటే.. మహేష్ బ్రహ్మోత్సవం, చరణ్ గోవిందుడు అందరివాడే లాగే ఈ సినిమా కూడా రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయ్యి ఉండేదని అంటున్నారు. అయితే ఇప్పుడే వారసుడు ఫలితాన్ని తేల్చేయలేం. ఒక్క ట్రైలర్‌తోనే సినిమాను ఖచ్చితంగా అంచనా వేయలేం. పైగా దిల్ రాజు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. మాస్ ఇమేజ్ ఉన్న విజయ్ను.. తమిళ తంబీలకు కొత్తగా చూపిస్తున్నాడు దిల్ రాజు. కాబట్టి వారసుడు ఇక్కడేమో గానీ.. అక్కడ మాత్రం హిట్ అయ్యే ఛాన్సేస్ కనిపిస్తున్నాయి. పైగా ట్రైలర్‌లోను ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ చూపించాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. అందుకే తెలుగు వరకు మహేష్ ఫ్యాన్స్ హ్యాపీ అయినా.. తమిళ్లో మాత్రం వారిసు ఆడే అవకాశాలే ఎక్కువ. మరి వారసుడు ఏం చేస్తాడో చూడాలి.