Gandhivadhara Arjun Pre Teaser is here.. Varuna's swag is out of the ordinary
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా సాక్షి వైద్య(Sakshi Vaidya ) హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం గాండీవధారి అర్జున(Gandhivadhara Arjun). ఎస్వీ సీసీ(SVCC) బ్యానర్ పై ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది. టైటిల్ తోను .. ఫస్టులుక్ తోను ఆడియన్స్ లో ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. మేకర్స్ తాజాగా ప్రీ టీజర్ ను విడుదల చేశారు. బ్యాడ్ బాయ్స్ డ్రైవ్స్ బ్యాడ్ టాయ్స్ అనే క్యాప్షన్ ను హైలెట్ గా చూపిస్తూ..అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో వరుణ్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందిని చూపించారు.
ఇక ప్రవీణ్ సత్తారు(Praveen Sattaru) చిత్రాలు అంటే కచ్చితంగా ఇంటెన్స్ కథతో పాటు అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలకు కొదువ ఉండదు. అందుకు తగ్గట్టుగానే ఈ ప్రీ టీజర్ లో భారీ గన్స్ తో ఆయన తన శత్రువులను వేటాడటం మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ రోల్ చాలా స్టైలీష్ గా ఉంటుందనే విషయం ఇది వరకే విడుదలైన ఫస్ట్ లుక్ లో చూశాము. ఇక ఈ ప్రీ టీజర్ లో వరుణ్ స్టైలిష్ నడక.. స్వాగ్ కనిపిస్తోంది. త్వరలోనే పూర్తి టీజర్ ను వదలనున్నట్టుగా ప్రకటించారు. ఇక డైరెక్టర్ ప్రవీణ సత్తార్ మార్క్ కథతో ఈ సినిమాను ఆగస్ట్ 25 న విడుదల చేయనున్నారు.