»Husband Killed Wife Eats Her Brain In Tacos Uses Skull As Ashtray In Mexico
Mexico: భార్య మెదడుతో సాస్ చేసుకుని తిని.. పుర్రెతో ఆష్ట్రే చేసి.. ఒళ్లు గగుర్పొడిచే హత్య
డ్రగ్స్‌కు బానిసైన ఓ భర్త తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ముందుగా భార్యను హతమార్చాడు భర్త. దీని తరువాత ఆమె మెదడును బయటకు తీసి చట్నీ చేసి, దానిని టాకోస్ (మెక్సికన్ డిష్) లో ఉంచి తిన్నాడు.
Mexico: డ్రగ్స్‌కు బానిసైన ఓ భర్త తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ముందుగా భార్యను హతమార్చాడు భర్త. దీని తరువాత ఆమె మెదడును బయటకు తీసి చట్నీ చేసి, దానిని టాకోస్ (మెక్సికన్ డిష్) లో ఉంచి తిన్నాడు. ఆపై అతను తన భార్య పుర్రెను చెక్కి, సిగరెట్ యాష్‌ట్రేని తయారు చేసి ఇంట్లో అలంకరించాడు. ఈ హత్య మెక్సికోలోని ప్యూబ్లో నగరంలో జరిగింది. పోలీసులు భర్తను అరెస్టు చేసిన తర్వాత వెల్లడైంది. ప్యూబ్లో నగరంలో నివసించే 32 ఏళ్ల అల్వారో, 38 ఏళ్ల మరియా మోంట్సెరాట్తో ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. మరియాకు అప్పటికే 12 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు గల 5 మంది కుమార్తెలు ఉన్నారు. వారి వైవాహిక జీవితం కొన్నాళ్లుగా సజావుగానే సాగుతుంది. వృత్తిరీత్యా బిల్డర్ అయిన అల్వారో జూన్ 29న తన భార్య మరియా మోంట్సెరాట్ను హఠాత్తుగా హత్య చేశాడు.
మెక్సికో పోలీసులు అల్వారోను అతని భార్యను చంపారనే ఆరోపణలపై జూలై 2న అతడిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భార్య హత్య జరిగిన సమయంలో అల్వారో నిషేధిత మత్తుమందు తాగి ఉన్నాడు. పోలీసులు అతడిని విచారించగా.. హత్యకు సంబంధించిన మొత్తం చెప్పాడు. శాంటా ముర్టే (మరణానికి సంబంధించిన పవిత్ర దేవత) , సైతాన్ ఈ హత్య చేయమని చెప్పారని తాను పేర్కొన్నాడు. భార్యను హతమార్చిన తర్వాత మెదడును బయటకు తీసి దాంతో సాస్‌ను తయారు చేసి టాకోస్‌లో కలిపి తిన్నానని పోలీసులకు తెలిపాడు. దీని తరువాత అతను పుర్రెను బూడిద వేసేందకు ఆష్ట్రే తయారు చేసి ఉపయోగించాడు. మృతదేహాన్ని ముక్కలు చేసిన తర్వాత పాలిథిన్ సంచిలో వేసి పారవేసినట్లు అల్వారో చెప్పారు. ఇందుకు సంబంధించిన మరిన్ని ఆధారాలను పోలీసులు వెతుకుతున్నారు.