Aadhar-Ration cards Link: వారికి గుడ్ న్యూస్.. రేషన్, ఆధార్ లింక్ గడువు పెంపు
ఆధార్ కార్డు, రేషన్ కార్డులను లింక్ చేసుకోవడానికి మరోసారి కేంద్రం గడువును పెంచింది. సెప్టెంబర్ 30, 2023లోగా ఆధార్, రేషన్ కార్డులు లింక్ చేసుకోవాలని సూచించింది.
కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను(Central govt schemes) అమలు చేయడానికి రేషన్(ration card), ఆధార్(Aadhar card) లింక్ చేసుకోమని సూచించింది. సంక్షేమ పథకాల అమలులో జరిగే మోసాలను అరికట్టేందుకు ఆధార్ లింక్(Link) తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని తెలిపింది. అందుకోసం జూన్ 30వ తేదిని ఆఖరుగా నిర్ణయించింది. తాజాగా ఆ గడువును పొడిగిస్తూ ప్రకటన చేసింది.
సెప్టెంబర్ 30వ తేదిలోగా రేషన్ కార్డు, ఆధార్ కార్డులను లింక్(Aadhar-Ration cards Link) చేసుకోవాలని కేంద్రం సూచించింది. అంత్యోదయ, అన్నయోజన పథకం కింద లబ్ధి పొందుతున్న వారికి ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. స్థానిక తహశీల్దార్ కార్యాలయాల్లో ఉచితంగానే ఆధార్, రేషన్ కార్డులను లింకు చేసుకోవచ్చని కేంద్ర తెలిపింది. తెల్లరేషన్ కార్డు ఉన్నవారు తమ కార్డును డిజిటలైజ్ చేసుకున్న తర్వాతే ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.