»Hero Nikhil Siddharth Has Publicly Apologized For Spy Movie
Nikhil Siddharth: క్షమాపణలు చెప్పిన హీరో నిఖిల్
స్పై సినిమా విషయంలో ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్దార్థ్. ఇకపై ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా క్వాలిటీ విషయం కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంటే బహిరంగ ప్రకటన విడుదల చేశారు.
Hero Nikhil Siddharth has publicly apologized for Spy movie
యంగ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddharth) ప్రేక్షకులకు బహిరంగా క్షమాపణలు చెప్పారు. కార్తికేయ 2(Karthikeya 2) సినిమా తరువాత పాన్ ఇండియా స్టార్ గా మారిన నిఖిల్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో స్పై(Spy) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారతదేశం స్వతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ పాయింట్ ను టచ్ చేస్తూ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా చిత్రంగా స్పై చిత్రం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా మాత్రం హీరో నిఖిల్ కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టింది. జులై 29న విడుదలై ఈ చిత్రం 5 రోజుల్లోనే రూ. 28.90 కోట్లు సాధించింది. నిఖిల్ కెరియర్ లోనే అత్యంత ఫాస్ట్ గా బ్రేక్ ఈవెన్ సాధించిన మూవీగా నిలిచిన స్పై చిత్రం విషయంలో ప్రేక్షకులను క్షమాపణలు తెలిపారు.
నాపై నమ్మకంతో చాలా మంది ఫాన్స్ సినిమాను చూడాలని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. నా కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ఇచ్చారు. ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉన్నా, కొంత బాధ కూడా ఉంది. కాంట్రాక్ట్, కంటెంట్ విషయాల్లో వచ్చిన సమస్యల వలన పాన్ ఇండియా స్థాయిలో స్పై సినిమాను విడుదల చేయలేకపోయాం. ఓవర్సీస్లో కూడా 350 వరకు తెలుగు ప్రీమియర్ షోలు రద్దు అయ్యాయి. హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెపుతున్నా అని నిఖిల్ ట్విట్టర్ వేదికగా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. కార్తికేయ 2 సినిమా సక్సెస్ మీట్ లో మీకు ప్రామిస్ చేశాను. రాబోవు చిత్రాలను మంచి ప్రణాళికతో సరైన టైమ్ లో విడుల చేస్తానని కానీ ఇప్పుడు మాట నిలబెట్టుకోలేక పోయాను. కానీ రాబోవు చిత్రాల విషయంలో అలా జరగదు. నా పై ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. క్వాలిటీ విషయంలో కూడా అస్సలు కాంప్రమైజ్ అయ్యేది లేదని ఆ ప్రకటనలో తెలిపారు.