Road accident in Saad Nagar.. A bike hit a student before school
Ranga Reddy: ఈ రోజుల్లో పనిమీద బయటకు వెళ్లిన మనుషులు యథావిధిగా ఇంటికి తిరిగి వచ్చేవరకు నమ్మకం లేదు. రోడ్డు మీదనే కాదు. గల్లీల్లో కూడా వాహనాల స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు. నిన్నటికి నిన్న బండ్ల గూడలో జరిగిన కారు ప్రమాదం(Bandla guda car accident) మరవక ముందే మరో ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాద్ నగర్ లోని ఓ పాఠశాల వీధిలో నిన్న సాయంత్రం ఓ బైక్ ప్రమాదం(Bike accident) చోటుచేసుకుంది. పాఠశాల ఆఖరి గంట మోగిన తరువాత జాలీగా ఇంటికి వెళుతున్న విద్యార్థనిలపై ఓ ఆకతాయి బైక్ వేగంగా దూసుకొచ్చి వెనుకనుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సదరు బాలిక తీవ్రంగా గాయపడింది.
స్కూల్ జోన్ లో బైక్ ను వేగంగా నడపడమే కాకుండా విద్యార్థిని ప్రమాదానికి గురిచేసి గాయాలకు కారకులైన యువకులు వెంటనే అక్కడి నుంచి బైక్ తో పరారి అయినట్లు తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడి స్థానికులు కింద పడిన విద్యార్థినిని లేపి ప్రథమ చికిత్స అందించి, అనంతరం దగ్గర్లోని ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిన్నారి చికిత్స పొందుతోంది. సీసీ కెమెరాలో రీకార్డు అయిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. దీంతో నడిచి వెళ్లినా కూడా ప్రమాదాలు తప్పడం లేదని, ఇంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తే ఎలా అని నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో గమనిస్తే.. స్కూల్ జోన్(School zone) పరిధిలో ఉన్న ఆ ప్రాంతంలో ఒక్క స్పీడ్ బ్రేకర్ కూడా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యంగా తెలుస్తుంది. అలాగే పాఠశాల యాజమాన్యం కూడా దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే స్పందించి అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయించడమో లేదా ప్రత్యమ్నాయంగా బార్ గేట్స్ ఏర్పాటు చేయడమో చేయాలని, ఇక వాహనదారులు కూడా బాధ్యతగా డ్రైవ్ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లేదంటే ఇలాంటి ప్రమాదాలలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. బండ్లగూడలో జరిగిన దుర్ఘటనలో మార్నింగ్ వాకింగ్ వెళ్లిన తల్లికూతుర్లు దుర్మరణం పాలయైన విషయం తెలిసిందే.
అతివేగంతో స్కూల్ విద్యార్థిని ఢీకొట్టిన బైక్
రంగారెడ్డి – షాద్ నగర్లో నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళుతూ రోడ్ దాటుతున్న విద్యార్థినిని అతివేగంతో వచ్చిన యువకులు ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు.తీవ్ర గాయాలైన విద్యార్థినిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. pic.twitter.com/D02a45nEGu