»Export Of Sircilla Boxer Green Needle To America New York Congratulations Ktr
Sircilla Boxer: డ్రాయర్లు అమెరికాకు ఎగుమతి..కేటీఆర్ అభినందన
తెలంగాణ సిరిసిల్ల జిల్లా అపారెల్ పార్క్‌లో తయారైన మొదటి ఆర్గానిక్ కాటన్ బాక్సర్ డ్రాయర్లు అమెరికా న్యూయార్క్‌కు ఎగుమతి కావడం పట్ల మంత్రి కేటీఆర్(KTR) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ చిత్రాలను పోస్ట్ చేసి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
తెలంగాణలోని సిరిసిల్ల(Sircilla) గ్రీన్ నీడిల్(GREEN NEEDLE) అపెరల్ పార్కులో తయారైన జీఎపీ ఆర్గానిక్ కాటన్ బాక్సర్లు డ్రాయర్లు అమెరికాకు ఎగుమతి కావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర్లంలో తయారైన ఆర్గానిక్ కాటన్ బాక్సర్లు ముంబైలోని JNPT మీదుగా న్యూయార్క్‌కు వెళ్తున్నాయి. ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ద్వారా మొదటి డెలివరీకి వెళుతున్న కాటన్ బాక్స్‌లు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో సిరిసిల్లలో తయారైనవి విదేశాలకు వెళ్లడం సంతోషంగా ఉందని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్నితెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటి రామారావు(KTR) ఎగుమతి గురించి ట్వీట్ చేశారు.
గోకుల్ దా ఇమేజెస్ ఆధ్వర్యంలో వస్త్రాల తయారీ కోసం సిరిసిల్లలో సుమారు 60 ఎకరాల్లో అపెరల్ పార్కును ఏర్పాటు చేశారు. గ్రీన్ నీడిల్ తన యూనిట్‌ను అపెరల్ పార్క్‌లో ఏర్పాటు చేసింది. దాని కస్టమర్లలో ఒకరిగా ఉన్న జెయింట్ క్లాటింగ్ బ్రాండ్ GAP. GAP కోసం తయారు చేయబడిన సిరిసిల్ల కాటన్ బాక్సర్ డ్రాయర్లు న్యూయార్క్‌కు ఎగుమతి చేయబడుతున్నాయి. సిరిసిల్లలో తయారైన జీఏపీ ఆర్గానిక్ కాటన్ బాక్సర్లను న్యూయార్క్ మార్కెట్‌కు ఎగుమతి చేయడంపై కేటీఆర్(KTR) సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఎగుమతులకు సిరిసిల్ల కంపెనీలు సిద్ధమవుతున్నాయన్నారు.
ఈ అపెరల్ పార్కులో సుమారు 10,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. 80 శాతం మంది ఉద్యోగులు మహిళలు ప్రధానంగా చేనేత కార్మికులు ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Happy to share that the first direct export cargo has been shipped by GREEN NEEDLE —the first factory at the Sircilla Apparel park for first customer—Gap organic Cotton boxers on their way to New York via JNPT at Mumbai