తిరుపతి(Tirupati)లో క్షుద్రపూజల కలకలం రేపింది. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ(Sri Venkateswara University)లో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో విద్యార్థులు(Students) ఆందోళన చెందుతున్నారు. ఎస్వీ యూనివర్సిటీ లైబ్రరీ భవనం(Library Building) వద్ద నాలుగు రోడ్ల కూడలిలో క్షుద్రపూజలు చేసినట్లు సమాచారం. రోడ్డు పక్కగా ముగ్గు వేసి, పుర్రె బొమ్మను చిత్రించారు. అలాగే ఆ ప్రాంతంలో పసుపు కుంకుమ చల్లారు.
కూడలి వద్ద సున్నం, ఉప్పు, బొగ్గుపొడితో ముగ్గు వేసి, రక్తం(Blood), కోడిగుడ్ల(Eggs)తో పూజలు చేసినట్టుగా తెలుస్తోంది. విద్యార్థులు ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారులకు తెలియజేశారు. అయితే వర్సిటీ ప్రాంగణంలో సీసీ కెమెరాలు(CC Cameras) సరిగా పనిచేయకపోవడం, సెక్యూరిటీ(Security) లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు(Students) ఆరోపణలు చేస్తున్నారు.
గత కొన్ని రోజుల నుంచి యూనివర్సిటీ(University)లోని పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని పలు విద్యార్థి సంఘాలు(Students Unions) కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీ(University)వారు వెంటనే సీసీ కెమెరాలు(CC Cameras) ఏర్పాటు చేయాలని, సెక్యూరిటీ గార్డుల(Security Guards) సంఖ్యను పెంచాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.