ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఆరోగ్యం క్షీణించి… అస్వత్తకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి ప్రధాని మోదీ కూడా వెళ్లారు. కాగా… ఈ విషయం తెలియగానే… రాహుల్ గాంధీ వెంటనే స్పందించారు. ట్విట్టర్ వేదికగా… మోదీ తల్లిగారు కోలుకోవాలని ఆకాంక్షించారు.
తల్లి, కొడుకు మధ్య ప్రేమ, ఆప్యాయతలు అమూల్యమైనవి, శాశ్వతమైనవని ఆయన ట్వీట్ చేశారు. మీ తల్లి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని, ఈ క్లిష్ట సమయంలో నా ప్రేమ, సపోర్ట్ మీకు ఉంటాయని ఆయన ట్వీట్ చేశారు.
వంద ఏళ్ళ వయస్సు గల హీరాబెన్ మోడీ అస్వస్థత కారణంగా బుధవారం ఉదయం అహ్మదాబాద్ లోని యుఎన్ మెహతా ఇన్స్ టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ, రీసెర్చ్ సెంటర్లో అడ్మిట్ అయ్యారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. హాస్పటల్ చుట్టూ సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. డ్రోన్లు వంటివాటిని ఎగురవేయడాన్ని నిషేధించారు. మోడీ తన తల్లిని చూడడానికి ఈ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది.