Bhola Shankar: ఇక మెగాస్టార్‌ను అదే కాపాడాలి.. లేదంటే మరో ‘ఆచార్య’నే?
వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర దుముదులిపేశారు మెగాస్టార్ చిరంజీవి. 200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కానీ ఈ సినిమా తర్వాత.. ఓ రీమేక్ మూవీతో రాబోతున్నారు మెగాస్టార్. ఈ సినిమా విషయంలోనే మెగా ఫ్యాన్స్ భయపడుతున్నారు. వాళ్లను మరింత భయపెట్టేలా టీజర్ రావడంతో ఇంకా టెన్షన్ పడుతున్నారు. దాంతో మెగాస్టార్‌ను ఇక అదే కాపాడాలి.. లేదంటే ఈ సినిమా మరో ఆచార్యనే అని అంటున్నారు.
తమిళ్ మూవీ వేదాళం రీమేక్‌గా ‘భోళా శంకర్’ (Bhola Shankar Movie) అనే సినిమా చేస్తున్నారు మెగాస్టార్(Megastar Chiranjeevi). ఈ సినిమాకు ఏ మాత్రం ఫామ్‌లోని ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్(Director Meher Ramesh) దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సమయం వచ్చినప్పుడల్లా.. ఈ రీమేక్ అసవరమా అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తునే ఉన్నారు. కానీ మెహర్ రమేశ్ మాత్రం దూసుకుపోతున్నాడు. ఆగస్ట్ 11న, ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. రీసెంట్‌గానే భోళ శంకర్ టీజర్ రిలీజ్ చేశారు. ఇదే ఇప్పుడు మెగాఫ్యాన్స్‌ను భయపెడుతోంది.
అనుకున్నట్టే ఈ టీజర్ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు. ఒక రొటీన్ మాస్ మూవీలా, రొడ్డ కొట్టుడు అనేలా టీజర్(Teaser) ఉందని అంటున్నారు. అసలు ఈ టీజర్ మెగాభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు. మెగాస్టార్(Megastar Chiranjeevi) గెటప్, తెలంగాణ యాస, ఆ డైలాగులు ఏ మాత్ర ఇంప్రెస్ చేసేలా లేవు. సోషల్ మీడియాలో ఈ సినిమా పై నెగటివ్ కామెంట్సే ఎక్కువగా వస్తున్నాయి. టీజర్ కంటెంట్ లాగే సినిమా కూడా అలాగే ఉంటే.. ఏంటి పరిస్థితి? అని చర్చ నడుస్తోంది. సినిమా ఏ మాత్రం తేడా కొట్టిన ట్రోలింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోవడం ఖాయమని అంటున్నారు. గతంలో ఆచార్య సినిమా విషయంలో మెగాస్టార్ పై ఎంతలా ట్రోలింగ్ జరిగిందో చూశాం.
ముఖ్యంగా.. చిరు ఓల్డ్ లుక్ గ్రాఫిక్స్ తేలిపోయాయి. ఇక ఇప్పుడు భోళా శంకర్(Bhola Shankar Movie) కూడా పాత కథే కాబట్టి.. అలాంటి సీన్ రిపీట్ అవుతుందా? అనే సందేహాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడే ఈ సినిమా పై ఓ అంచనాకు రాలేం. భోళా శంకర్ ట్రైలర్ బయటికొస్తే గానీ.. అసలు మ్యాటర్ తేలే ఛాన్స్ లేదు. ట్రైలర్ బాగుంటే.. ఈ సినిమా రిజల్ట్ మీద ముందే ఒక అంచనాకు వచ్చేయొచ్చు. కాబట్టి.. ఇక మెగాస్టార్‌ను ట్రైలరే కాపాడాలి మరి!