ప్రస్తుతం యంగ్ హీరో నిఖిల్.. కార్తికేయ 2 సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మూవీ.. నార్త్‌లో దుమ్ముదులేపిసింది. ఏకంగా వంద కోట్ల క్లబ్బులో జాయిన్ అయింది కార్తికేయ2. అసలు ఈరేంజ్‌లో సినిమా హిట్ అవుతుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు. కానీ కార్తికేయకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక నిఖిల్ అయితే గాల్లో తేలుతున్నాడనే చెప్పాలి. అంతేకాదు కార్తికేయతో వచ్చిన క్రేజ్‌ను అప్ కమింగ్ ప్రాజెక్ట్స్‌తో నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో నిఖిల్ తన రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసినట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు ఐదు కోట్లకు అటు ఇటుగా తీసుకునే ఈ యంగ్ హీరో.. ఇకపై పది నుంచి పన్నెండు కోట్ల పారితోషికం తీసుకోవాలనుకుంటున్నాడట. దాంతో నిఖిల్‌కు డిమాండ్ భారీగా పెరిగిపోయిందని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే నిఖిల్‌కు బాలీవుడ్ నుంచి బడా ఆఫర్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. హిందీకి చెందిన రెండు ప్రొడక్షన్ హౌస్‌లు తనను సంప్రదించాయని చెప్పాడు నిఖిల్. అలాగే కొంతమంది బాలీవుడ్ స్టార్స్ తనను ప్రైవేట్‌గా పిలిచి ప్రశంసించారని చెప్పాడు. అయితే నిఖిల్ ఆ బాలీవుడ్ ఆఫర్లకు ఓకే చెప్పాడా లేదా అనేది క్లారిటీ లేదు. కానీ నిఖిల్‌కు ఒక్కసారిగా హిందీలో డిమాండ్ పెరిగిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం నిఖిల్ 18 పేజెస్.. స్పై సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో స్పై మూవీని పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ రా ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ఏదేమైనా నిఖిల్ మాత్రం ఊహించని విధంగా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నాడనే చెప్పొచ్చు.