భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ సమరానికి రంగం సిద్ధమైంది. సిరీస్లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ రేపు నాగ్పూర్ వేదికగా జరగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సొంతగడ్డపై సిరీస్ను విజయంతో ఘనంగా ఆరంభించాలని టీమిండియా భావిస్తుండగా, గట్టి పోటీ ఇవ్వాలని కివీస్ పట్టుదలగా ఉంది.