బ్రిటిష్ వారిని గడగడలాడించి, అడవి బిడ్డల కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు. గిరిజనులలో ధైర్యాన్ని నింపి, వారిని ఒక సైన్యంగా మార్చి బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించారు. బ్రిటిష్ వారి ఆధునిక తుపాకులను.. అల్లూరి కేవలం విల్లు, బాణాలతోనే ఎదుర్కొన్నారు. ‘నేను చనిపోయినా నా ప్రతి రక్తపు బొట్టు ఒక సీతారామరాజుగా మారుతుంది’ అని దేశం కోసం ప్రాణాలర్పించారు.