ATP: గుత్తిలోని తాడిపత్రి రోడ్డులో నివాసముండే జయమ్మ సోమవారం ప్రమాదవశాత్తు మిద్దె మెట్ల మీద నుంచి జారి కింద పడి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జయమ్మ తలకు వైద్యులు ఆరు కుట్లు వేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.