VKB: మోమిన్‌పేట మండల వెల్చాల్ గ్రామంలో నూతన సర్పంచిగా ఎన్నికైన కావలి శ్రీనివాస్ మొట్టమొదటిసారి సంపూర్ణ మధ్య నిషేధం కోసం శ్రీకారం చుట్టారు. గ్రామస్తులందరి చేత సామూహిక ప్రతిజ్ఞ చేయించి తీర్మానం చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కావలిశ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో బెల్టు షాపుల్లో మద్యం అమ్మిన వారికి 25 వేలు, కొన్నవారికి 5000 రూపాయలు జరిమానా విధిస్తామన్నారు.