లైగర్ మూవీ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ.. ఇద్దరి పాన్ ఇండియా ఆశలను ఆవిరి చేసేసింది. దీని దెబ్బకు పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన ఆగిపోయింది. ఆపై పూరి, రౌడీ ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రజెంట్ పూరి మెగాస్టార్ చిరంజీవి కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రాసే పనిలో ఉండగా.. విజయ్ మరో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. కాకపోతే అప్ కమింగ్ సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తోంది. అయితే సామ్ మయో సైటిస్ వ్యాధి బారిన పడడంతో.. ఖుషి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారు. త్వరలోనే షూట్ మొదలు పెట్టి.. వచ్చే సమ్మర్లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ లోపే మరో సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు రౌడీ. ఇప్పటికే యంగ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. రామ్ చరణ్‌తో అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో.. విజయ్‌తో సెట్ చేసుకున్నాడు గౌతమ్. అతి త్వరలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రాబోతునట్టు తెలుస్తోంది. గతంలో గౌతమ్ తిన్ననూరి.. నానితో చేసిన ‘జెర్సీ’ మూవీ కూడా క్రీడా నేపథ్యంలోనే తెరకెక్కింది. దాంతో మరోసారి అదే జానర్ టచ్ చేస్తున్నట్టు టాక్. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.