ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ కియా ఇండియా (Kia India) జూలై 4న సరికొత్త కియా సెల్టోస్ 2023 (Kia Seltos 2023)ని లాంచ్ చేయనుంది. సౌత్ కొరియన్ కార్ మేకర్ కియా భారతదేశంలో తన మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. వచ్చీరాగానే కియా ఇండియాలో సెల్టోస్, సోనెట్ లతో సంచలనం క్రియేట్ చేసింది. భారత ప్రజలు అభిరుచికి అనుగుణంగా తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లను అందించింది. 2019లో సెల్టోస్ ని తీసుకువచ్చింది. తాజాగా కియా సెల్టోస్ (Kia Seltos2023) ని తీసుకురాబోతోంది. జూలై 4న తన కొత్త సెల్టోస్ 2023 కారును ఆవిష్కరించబోతోంది.
హ్యుందాయ్ (Hyundai) క్రేటాకు కియా సెల్టోస్ భారీ పోటీ ఇవ్వనుంది. కియా సోనెట్, కేరెన్స్, కార్నివాల్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. కియా దేశీయ విపణిలో 364,115 యూనిట్లకు పైగా సెల్టోస్‌లను విక్రయించగా, కార్‌మేకర్ మధ్యప్రాచ్యం, ఆఫ్రికా(Africa), మధ్య, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా-పసిఫిక్లతో సహా దాదాపు 100 మార్కెట్లకు 135,885 యూనిట్ల కన్నా ఎక్కువ SUVలను ఎగుమతి చేసింది. కియా సెల్టోస్ 2023 విషయానికి వస్తే.. ఫేస్‌లిఫ్టెడ్ SUV ఇప్పటికే భారత మార్కెట్లోస్పైడ్ టెస్టింగ్ అయింది.
లేటెస్ట్ LED DRLలతో రీడిజైన్ చేసిన LED హెడ్‌ల్యాంప్‌లు, పెద్ద గ్రిల్, ఫాగ్ ల్యాంప్‌లకు కొత్త హౌసింగ్‌లను పొందుతుంది. కొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. LED టెయిల్‌ల్యాంప్‌లు, మధ్య కనెక్ట్ అయిన బార్‌ను కలిగి ఉంది. అలాగే, ఫ్రంట్, బ్యాక్ బంపర్లు కొత్తగా మార్పులు చేసింది. ప్రస్తుతం, కియా సెల్టోస్ 2023 క్యాబిన్లో ఎన్ని మార్పులు చేశారనేది స్పష్టంగా తెలియలేదు. అయితే, ఈ వెహికల్ ఫుల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మరింత అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్‌ను పొందనుంది.