NLG: చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, 12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శనివారం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మూడో వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు.