ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని మరమ్మతులు చేపట్టనున్న బ్రిడ్జిని యువజన కాంగ్రెస్ బోథ్ అసెంబ్లీ అధ్యక్షుడు పోతారెడ్డి స్థానిక నాయకులతో కలిసి ఇవాళ పరిశీలించారు. పంట పొలాల్లోకి వెళ్లేందుకు వీలుగా త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు నాయకులు పేర్కొన్నారు. నాయకులు ఎండీ సద్దాం, రైతులు తదితరులు ఉన్నారు.