ములుగు జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు పకడ్బందీ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. జాతర ప్రాంతంలో 50 పడకల ప్రధాన హాస్పిటల్తో పాటు 2 మినీ హాస్పిటళ్లు, 30 మెడికల్ క్యాంపులు, మొత్తం 3,199 మంది వైద్య సిబ్బందితో 24 గంటల వైద్య సేవలు అందించనున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం తెలిపారు.