NGKL: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక కర్షక పోరుయాత్ర శనివారం సాయంత్రం కల్వకుర్తి పట్టణానికి చేరుకుంది. యాత్ర సభ్యులకు స్థానిక నాయకులు పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తా వద్ద ఘనస్వాగతం పలికారు.